Prabhas: 'జాన్'లో స్కూల్ టీచర్ గా పూజా హెగ్డే

  • షూటింగు దశలో 'జాన్' 
  • 1960నాటి ప్రేమకథా నేపథ్యం
  • వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు

ప్రస్తుతం తెలుగులో పూజా హెగ్డే జోరు కొనసాగుతోంది. 'గద్దలకొండ గణేశ్' సినిమాలో ఆమె పోషించిన పాత్రకి మంచి మార్కులు పడ్డాయి. లంగావోణీతో ఈ సుందరి కుర్రకారు మనసులను దోచేసింది. మరోమారు ఆమె డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నట్టుగా ఒక వార్త వినిపిస్తోంది.

ప్రభాస్ కథానాయకుడిగా రాధాకృష్ణ దర్శకత్వంలో 'జాన్' రూపొందుతోంది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, ఆల్రెడీ ఒక షెడ్యూల్ షూటింగును జరుపుకుంది. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె స్కూల్ టీచర్ పాత్రలో డిఫరెంట్ లుక్ తో కనిపించనుందని అంటున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 1960 కాలంలో యూరప్ లో జరిగిన ఒక అందమైన ప్రేమకథను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందుతుండటం విశేషం.

More Telugu News