Sensex: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
  • 503 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 148 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 503 పాయింట్లు కోల్పోయి 38,593కి పడిపోయింది. నిఫ్టీ 148 పాయింట్లు పతనమై 11,440కు దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (4.39%), టీసీఎస్ (2.13%), ఎన్టీపీసీ (1.74%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.73%), టెక్ మహీంద్రా (0.23%).

టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-7.37%), టాటా మోటార్స్ (-6.00%), మారుతి సుజుకి (-5.25%), యస్ బ్యాంక్ (-4.19%), మహీంద్రా అండ్ మహీంద్రా (-4.18%).

More Telugu News