India: ప్రపంచం దృష్టిని మరల్చేందుకే మాపై ఆరోపణలు: భారత ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలకు బదులిచ్చిన పాక్

  • బాలాకోట్ లో మళ్లీ ఉగ్ర కదలికలు కనిపిస్తున్నాయన్న బిపిన్ రావత్
  • అవన్నీ నిరాధార ఆరోపణలంటూ కొట్టిపారేసిన పాక్
  • స్పందించిన పాక్ విదేశాంగ శాఖ

జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడంపై పాకిస్థాన్ ఉడికిపోతోంది. కశ్మీర్ పై స్వదేశీ అతివాదులను సంతృప్తి పరచడానికి నానా పాట్లు పడుతోంది. ఈ క్రమంలో భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలతో పుండు మీద కారం చల్లినట్టుగా బాధ పడిపోతోంది. బాలాకోట్ లో మళ్లీ ఉగ్రఛాయలు కనిపిస్తున్నాయని, ఇక్కడ ఉగ్ర శిబిరం ఉందనడానికి ఇదే నిదర్శనం అని రావత్ వ్యాఖ్యానించారు.

దీనిపై పాక్ స్పందిస్తూ, భారత ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని, అవన్నీ నిరాధారమని పేర్కొంది. కశ్మీర్ ప్రస్తుత పరిస్థితుల నుంచి ప్రపంచం దృష్టిని మరల్చేందుకు భారత్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని ఆరోపించింది. ఈ మేరకు పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఓ ప్రకటన చేసింది.

More Telugu News