Mango: మామిడిపండ్లు దొంగిలించాడని భారత కార్మికుడికి దేశ బహిష్కరణ

  • దుబాయ్ లో ఘటన
  • ఆకలి వేయడంతో రెండు పండ్లు దొంగిలించానన్న యువకుడు
  • అది తప్పేనంటూ శిక్ష విధించిన యూఏఈ న్యాయస్థానం

భారత్ కు చెందిన ఓ కార్మికుడు దుబాయ్ ఎయిర్ పోర్టులో పనిచేస్తూ రెండు మామిడిపండ్లు దొంగిలించాడు. ఈ నేరం నిరూపితం కావడంతో అతడికి దేశ బహిష్కరణ విధిస్తూ యూఏఈ న్యాయస్థానం కఠినశిక్ష విధించింది. 27 ఏళ్ల భారతీయ యువకుడు దుబాయ్ విమానాశ్రయంలో ప్రయాణికుల లగేజీని కంటెయినర్ నుంచి కన్వేయర్ బెల్టుపై ఉంచడం వంటి విధులు నిర్వర్తించేవాడు. 2017లో ఓ లగేజీ నుంచి రెండు మామిడిపండ్లు దొంగతనం చేశాడు.

ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న అధికారులు ఆ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ సందర్భంగా తన తప్పును అంగీకరించిన ఆ యువకుడు దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించాడు. బాగా ఆకలి వేస్తుండడంతో పాటు దాహంగా ఉండడంతో మామిడిపండ్లను తీసుకున్నానని వెల్లడించాడు. అయితే తప్పు తప్పేనంటూ యూఏఈ న్యాయస్థానం దేశ బహిష్కరణ శిక్ష విధించింది. దాంతోపాటే నగదు జరిమానా కూడా వడ్డించింది.

More Telugu News