Shilpa Chakravarthi: నా కాన్ఫిడెన్స్ ను దెబ్బకొట్టడానికి శ్రీముఖి ప్రయత్నించింది: శిల్పా చక్రవర్తి

  • అందరిలో త్వరగా కలవలేకపోయాను
  • సాన్నిహిత్యం పెరిగేందుకు సమయం పట్టింది  
  • స్క్రీన్ పై నన్ను ఎక్కువగా చూపించలేదు
యాంకర్ గా .. నటిగా శిల్పా చక్రవర్తికి మంచి గుర్తింపు వుంది. ఇటీవల 'బిగ్ బాస్' హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన ఆమె, చాలా తక్కువ సమయంలోనే ఎలిమినేట్ అయ్యారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన నేను లోపలున్న వారితో వెంటనే కలవలేకపోయాను. అంతా కొత్తవారు కావడం వలన వాళ్లతో సాన్నిహిత్యం పెరగడానికి నాకు కొంత సమయం పట్టింది .. ఈ లోగానే బయటికి వచ్చేశాను.

ఒక రోజున శ్రీముఖి నా దగ్గరికి వచ్చి. 'ఈ వారం మీరైనా .. హిమజ అయినా ఎలిమినేట్ అవుతారని ఇంట్లో అంతా అనుకుంటున్నారు' అంటూ నా కాన్ఫిడెన్స్ ను దెబ్బకొట్టడానికి ప్రయత్నించింది. 'ఎందుకు అలా అనుకుంటున్నారు?' అంటూ అప్పుడే నేను అడిగేశాను. స్క్రీన్ పై కొంతమందిని చూపించినట్టుగా, నాకు సంబంధించిన విషయాలను చూపించలేదు. అందువల్లనే నా విషయంలో అభిప్రాయాలు మారిపోయి ఉండొచ్చు" అని చెప్పుకొచ్చారు.
Shilpa Chakravarthi

More Telugu News