Hyderabad: ‘మెట్రో’ ఘటన..మౌనిక కుటుంబ సభ్యులకు నష్టపరిహారం!

  • అమీర్ పేట్ లో ‘మెట్రో’ పెచ్చులూడి పడిన ఘటన
  • రూ.20 లక్షల నష్టపరిహారం ఇచ్చేందుకు అంగీకారం
  • బాధిత కుటుంబానికి ఓ ఉద్యోగం కూడా: ఎల్ అండ్ టీ అధికారుల హామీ
నిన్న అమీర్ పేట్ మెట్రో రైల్వేస్టేషన్ పై భాగం నుంచి పెచ్చులూడి పడిన ఘటనలో యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మౌనిక మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో మృతురాలి కుటుంబసభ్యులకు రూ.20 లక్షలు నష్టపరిహారం ఇచ్చేందుకు ఎల్ అండ్ టీ సంస్థ అంగీకరించింది. దీంతో పాటు ఆమె కుటుంబసభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది

కాగా, మౌనిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. ఆసుపత్రి వద్ద ప్రజాసంఘాల నాయకులు, ఆమె కుటుంబసభ్యులు ఉన్నారు. నిన్న మౌనిక ప్రమాదానికి గురైన తర్వాత నుంచి పోస్టుమార్టం నిర్వహించే వరకూ ఎల్ అండ్ టీ అధికారులు ఎవ్వరూ రాలేదని అన్నారు. మెట్రో ఎండీ ఎంవీఎస్ రెడ్డితో మాట్లాడిన తర్వాత వారు స్పందించారని, చర్చలు జరిగాయని చెప్పారు. మౌనిక కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం కింద ఇవ్వాలని డిమాండ్ చేశామని చెప్పారు.
Hyderabad
Metro Railway station
Ameerpet

More Telugu News