Central minister: సమయం వచ్చినప్పుడు పీవోకే సంగతి తేలుస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • ఒక్క తుపాకీ పేలకుండా 370 ఆర్టికల్ ను రద్దు చేశాం
  • ఈ ఆర్టికల్ వల్ల పాక్ తో నాలుగు యుద్ధాలు జరిగాయి
  • ఈసారి యుద్ధం వస్తే ప్రపంచపటంలో పాకిస్థాన్ ఉండదు
ఒక్క తుపాకీ కూడా పేలకుండా ఆర్టికల్ 370ను రద్దు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.. తూర్పుగోదావరి జిల్లాల్లో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ఈ ఆర్టికల్ వల్ల పాకిస్థాన్ తో నాలుగు యుద్ధాలు జరిగాయని, ఇప్పటివరకు 42 వేల మంది ప్రజలు ఉగ్రవాదానికి బలయ్యారని అన్నారు. సమయం వచ్చినప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) సంగతి తేలుస్తామని వ్యాఖ్యానించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రభుత్వం భారత్ లో లేదని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య ఈసారి యుద్ధం వస్తే ప్రపంచపటంలో పాకిస్థాన్ ఉండదు అని అన్నారు.
Central minister
Kishan reddy
Article 370
POK

More Telugu News