Telangana: ఇంకొన్ని పథకాలు ఉన్నాయి.. వాటిని ప్రవేశపెడితే ‘కాంగ్రెస్’ పని ఖతమే: సీఎం కేసీఆర్

  • ఇంకో రెండో పర్యాయాలు టీఆర్ఎస్ దే అధికారం
  • ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేది ప్రాంతీయ పార్టీలే
  • దుర్మార్గాలకు దేశంలో ఉన్న బ్రీడింగ్ సెంటరే ‘కాంగ్రెస్’
ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేది ప్రాంతీయ పార్టీలేనని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇవాళ చివరిరోజు సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంకో రెండో పర్యాయాలు టీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై ఆయన విమర్శలు గుప్పించారు. తమ దగ్గర ఇంకో రెండు, మూడు పథకాలు ఉన్నాయని, వాటిని రాష్ట్రంలో ప్రవేశపెడితే కనుక కాంగ్రెస్ పార్టీ పని ఖతమేనని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ హయాంలో అప్పు లేకుండా కట్టిన ప్రాజెక్టు ఒక్కటయినా ఉందా? నీటి లభ్యత లేని ప్రాంతాల్లో ప్రాజెక్టులు ఎలా కడతారు? అని ప్రశ్నించారు. దుర్మార్గాలకు దేశంలో ఉన్న బ్రీడింగ్ సెంటరే ‘కాంగ్రెస్’ అని నిప్పులు చెరిగారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఈ రెండు పార్టీల వల్లే చతికిలపడిందని, దేశంలోని పేదరికానికీ ఈ పార్టీలే కారణమని విమర్శించారు.  
Telangana
cm
kcr
Congress
bjp
Assembly

More Telugu News