ముస్లిం రిజర్వేషన్ల విషయంలో మేం క్లియర్...కేంద్రానిదే ఆలస్యం : సీఎం కేసీఆర్
- మా వైఖరిలో తేడా లేదు
- అసెంబ్లీలో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి
- అవసరమైతే మరోసారి తీర్మానం
ఇక, విపక్ష కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ ప్రమాదం వెంటాడుతున్నది టీఆర్‌ఎస్‌ను కాదని, కాంగ్రెస్‌నని ఆ పార్టీ నాయకులు గుర్తుంచుకుంటే మంచిదని చెప్పారు. అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 21 నుంచి 9కి పడిపోతే బీజేపీ బలం 5 నుంచి ఒకటికి పరిమితమయ్యిందన్నారు. అటువంటప్పుడు ఎవరికి ప్రమాదమని ప్రశ్నించారు. కాంగ్రెస్ అడ్డగోలుగా మాట్లాడుతోందని, రాష్ట్ర అభివృద్ధికోసమే అప్పు చేశామని, అవసరమైతే ఇంకా చేస్తామని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేసి తమ ప్రభుత్వం సత్తా ఏమిటో చాటామన్నారు.