మాజీ ఎంపీ శివప్రసాద్‌కు సర్కారు లాంఛనాలతో అంతిమ సంస్కారం
- చంద్రగిరి మండలం అగరాలలో అంత్యక్రియలు
- సాయంత్రం 4 గంటలకు ప్రారంభంకానున్న అంతిమ యాత్ర
- యాత్రలో పాల్గొననున్న టీడీపీ అధినేత చంద్రబాబు
రాజకీయ, సినీరంగంలో తనదైన ముద్ర వేసిన ఎంపీ శివప్రసాద్ కిడ్నీ సంబంధిత వ్యాధితో చెన్నైలో చికిత్స పొందుతూ నిన్న మధ్యాహ్నం కన్నుమూశారు. చంద్రగిరి మండలం అగరాలలో ఇవాళ శివప్రసాద్ అంత్యక్రియలు జరగనున్నాయి. తిరుపతి ఎన్జీవోస్ కాలనీలోని నివాసం నుంచి సాయంత్రం 4 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. శివప్రసాద్ అంతిమయాత్రలో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొననున్నారు.