విజయవాడ విమానానికి పిడుగుపాటు.. గాల్లో ఊగిన విమానం.. సిబ్బందికి గాయాలు
- నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరిన విమానం
- భారీ వర్షం, ఉరుములు, మెరుపులు
- గన్నవరంలో క్షేమంగా ల్యాండైన విమానం
విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం ప్రారంభమైంది. విమానంపై పిడుగు పడకున్నా ఆ ప్రభావం మాత్రం విమానంపై పడింది. దీంతో విమానం గాల్లో ఊయలలా అటూఇటూ ఊగిపోయింది. ప్రయాణికులకు భయభ్రాంతులు గురయ్యారు. ప్రయాణికులు గాయపడకపోయినప్పటికీ కొందరు సిబ్బంది మాత్రం గాయపడ్డారు. విమానం గన్నవరంలో సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.