కచ్చలూరు ప్రమాదం మరువకముందే గోదావరిలో ప్రత్యక్షమైన మరో బోటు!

ఇటీవల తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద గోదావరిలో ఎంతటి స్థాయిలో బోటు ప్రమాదం జరిగిందో తెలిసిందే. పర్యాటకులతో ప్రయాణిస్తున్న బోటు సుడిగుండం కారణంగా మునిగిపోగా, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం మరువకముందే గోదావరిలో దేవీపట్నం వద్ద ఓ బోటు ప్రయాణిస్తూ దర్శనమిచ్చింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు వెంటనే ఆ బోటును నిలిపివేసి ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ బోటులో దేవీపట్నం తహసీల్దార్ బంధువులు ఉన్నట్టు గుర్తించారు. తహసీల్దార్ తన బంధువుల కోసం బోటు పంపినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Godavari
East Godavari District
Devipatnam
Boat

More Telugu News