Vijay devarakonda: 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫస్టులుక్ రిలీజ్

  • నాలుగు షేడ్స్ తో విజయ్ దేవరకొండ పాత్ర 
  • నలుగురు కథానాయికలకు చోటు 
  • సంగీత దర్శకుడిగా గోపీసుందర్   

క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ఒక విభిన్నమైన కథా చిత్రం రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమాకి 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై వల్లభ నిర్మిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్టులుక్ ను వదిలారు.

ముఖం మీద గాయాలతో .. చేతిలో సిగరెట్ తో విజయ్ దేవరకొండ చాలా రఫ్ లుక్ తో ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. ఎవరితోనో గొడవపడిన తరువాత కసిగా అరుస్తున్నట్టుగా విజయ్ దేవరకొండ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. విజయ్ దేవరకొండ పాత్రలో నాలుగు షేడ్స్ ఉంటాయట. ఈ సినిమాలో ఆయన సరసన నలుగురు కథానాయికలు కనిపించనున్నారు. ఆ జాబితాలో రాశి ఖన్నా .. కేథరిన్ .. ఐశ్వర్య రాజేశ్ .. ఎజిబెల్లా కనిపిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.

More Telugu News