East Godavari District: చేతులెత్తేసిన అధికారులు.. బోటు వెలికితీత చర్యలు నిలిపివేత

షార్ట్స్‌లో చూడండి
తూర్పుగోదావరి జిల్లాలోని కచ్చలూరు వద్ద గోదావరి నదిలో మునిగిన బోటును వెలికి తీసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఆ చర్యలు నిలిపివేశారు. కాకినాడ, ముంబైల నుంచి నిపుణులను తెప్పించినప్పటికీ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో బోటు వెలికితీత పనులను అధికారులు నిలిపివేశారు. సహాయక చర్యల్లో పాల్గొన్న నేవీ, ఎన్‌డీఆర్ఎఫ్ దళాలు, ఇతర బృందాలు కూడా ఘటనా స్థలం నుంచి వెనక్కి వెళ్లిపోయాయి. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇప్పటి వరకు 35 మంది మృతదేహాలను అధికారులు వెలికితీశారు. ఇంకా 16 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. కాగా, ప్రమాదం జరిగిన కచ్చలూరు పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.  

Go Back to Shorts
East Godavari District
boat accident
Andhra Pradesh

More Telugu News