విజయవాడలో హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన వైసీపీ నేత రోజా.. వాసిరెడ్డి పద్మతో కలిసి సందడి!
- శేషసాయి కల్యాణ మండపంలో ఏర్పాటు
- జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఏపీఐఐసీ చైర్మన్
- మొత్తం లాభాలను దాతృత్వానికి వాడనున్న సంస్థ
తొలుత ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన అనంతరం రోజా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం చేనేత వస్త్రాలు ధరించిన మోడల్స్ తో కలిసి ఫొటోలకు పోజులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రోజాతో పాటు ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా పాల్గొన్నారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే మొత్తాన్ని నిర్వాహకులు దాతృత్వం కోసం వినియోగించనున్నారు.

