spicejet: చెన్నై-విశాఖ-విజయవాడ మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు

  • వచ్చే నెల 27న నుంచి అందుబాటులోకి సేవలు
  • చెన్నైలో ఉదయం 6:30 గంటలకు బయలుదేరి 8:30కు విశాఖకు
  • 9:30 గంటలకు విజయవాడ చేరుకోనున్న విమానం

విశాఖపట్టణం-విజయవాడ మధ్య స్పైస్‌జెట్ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే నెల 27 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్టు  టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు విజయమోహన్‌  తెలిపారు. స్పైస్‌జెట్ విమానం ఉదయం 6:30 గంటలకు చెన్నైలో బయలుదేరి 8:05 గంటలకు విశాఖ వస్తుంది. అక్కడి నుంచి 8:30 గంటలకు బయలుదేరి 9:30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి 9:50 గంటలకు బయలుదేరి 10:50 గంటలకు విశాఖ వెళ్లి అక్కడ 11:20 గంటలకు బయలుదేరి 12:55 గంటలకు చెన్నై చేరుకుంటుందని విజయమోహన్ తెలిపారు. చెన్నై నుంచి విశాఖకు నడవనున్న తొలి విమాన సర్వీసు ఇదేనని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

More Telugu News