యువతకు ఇచ్చిన హామీని నెరవేర్చే పనిలో పంజాబ్ ప్రభుత్వం.. త్వరలో యువతకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీ
- అధికారంలోకి వస్తే స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేస్తామని హామీ
- మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్
- డిసెంబరు నుంచి దశలవారీగా పంపిణీ
ఇందులో భాగంగా తొలుత 11, 12 తరగతులు చదువుతున్న స్మార్ట్‌ఫోన్ లేని విద్యార్థులకు వాటిని పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం పంపిణీ చేయనున్న స్మార్ట్‌ఫోన్లలో పలు ఫీచర్లు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ పథకాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు బహిరంగ వేలం ద్వారా కంపెనీలను ఎంపిక చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. డిసెంబరు నుంచి ఫోన్ల పంపిణీ దశల వారీగా ప్రారంభం కానుంది.