Harish Shankar: ఆ రోజున అన్నపూర్ణ స్టూడియో నుంచి ఏడుస్తూ వెళ్లిపోయాను: దర్శకుడు హరీశ్ శంకర్

  • మొదటి నుంచి సినిమాలంటే ఇష్టం
  • ఆ దర్శకుడు నాకు రూపాయి కూడా ఇవ్వలేదు 
  • రెండేళ్ల కష్టం వృథా అయిందన్న హరీశ్     

దర్శకుడు హరీశ్ శంకర్ రూపొందించిన 'వాల్మీకి' చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో హరీశ్ శంకర్ మాట్లాడుతూ, కెరియర్ తొలినాళ్లలో తనకి ఎదురైన బాధాకరమైన ఒక సంఘటనను గురించి ప్రస్తావించాడు. "మొదటి నుంచి కూడా సినిమాలంటే ఇష్టం. అందువల్లనే దర్శకుడిని కావాలనే ఉద్దేశంతో ఒక దర్శకుడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా దాదాపు రెండేళ్లు పనిచేశాను. కథా చర్చల్లో పాల్గొన్నాను .. స్క్రిప్ట్ పై కసరత్తు చేశాను.

ఒక రోజున అన్నపూర్ణ స్టూడియోలో ఆ సినిమా షూటింగ్ మొదలైంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా పత్రికల్లో నా పేరు చూసుకోబోతున్నాను అనే ఆత్రుతతో షూటింగ్ స్పాట్ కి వెళ్లాను. ముహూర్తం రోజున సినిమాకి సంబంధించిన సాంకేతిక నిపుణుల పేర్లను మీడియాకి ఇస్తారు .. ఆ లిస్టులో నా పేరు లేదు. దర్శకుడిని ఆ విషయాన్ని గురించి అడిగితే ఏదో సమాధానం చెప్పాడు. రెండేళ్లు కష్టపడ్డాను .. రూపాయి కూడా ఇవ్వలేదు .. ఇప్పుడు పేరు కూడా వేయలేదు అనే ఆలోచన రాగానే ఏడుపొచ్చేసింది. అలా ఏడ్చుకుంటూనే అన్నపూర్ణ స్టూడియోలో నుంచి బయటికి వచ్చేశాను" అని చెప్పుకొచ్చాడు

More Telugu News