ap7am logo

కాకినాడలో కుంగిన అపార్టుమెంట్.. ఏ క్షణంలోనైనా కూలిపోయే అవకాశం!

Thu, Sep 19, 2019, 05:47 PM
  • భాస్కర్ ఎస్టేట్స్ అపార్ట్ మెంట్ లో ఘటన
  • భూమిలోకి కుంగిపోయిన మూడు పిల్లర్లు
  • ఏం జరుగుతుందో అర్థం కాక అపార్టుమెంట్ వాసుల భయాందోళనలు  
తూర్పుగోదావరి జిల్లా, కాకినాడలోని ఓ బహుళ అంతస్తుల అపార్టుమెంట్ పిల్లర్లు భూమిలోకి కుంగిపోయాయి. భాస్కర్ ఎస్టేట్స్ అపార్ట్ మెంట్ లో మొత్తం ఐదు అంతస్తులు ఉన్నాయి. అపార్టు మెంట్ వెనుక భాగంలో మూడు పిల్లర్లు భూమిలోకి కుంగిపోయాయి. కుంగిన పిల్లర్లకు తాత్కాలికంగా కర్రలను సపోర్ట్ గా పెట్టారు. ఏ క్షణంలోనైనా అపార్టు మెంట్ కూలిపోయే అవకాశం ఉంది.

దీంతో, అపార్టుమెంట్ వాసులు భయాందోళనలకు గురయ్యారు. ఈ సమాచారం మేరకు అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ అపార్టుమెంట్ లోని నలభై కుటుంబాలను ఖాళీ చేయిస్తున్నారు. తమ గదుల్లో ఉన్న వస్తువులను బయటకు తీసుకురావడానికి అపార్ట్ మెంట్ వాసులు భయపడుతున్నారు. స్థానిక దేవీ మల్టీప్లెక్స్ సమీపంలో పదమూడేళ్ల క్రితం ఈ అపార్టుమెంట్ ను నిర్మించారు.
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
GarudaVega Banner Ad