Andhra Pradesh: ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగుల ఎంపిక ఫలితాలను విడుదల చేసిన సీఎం జగన్!

  • ఈ నెలలో పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం
  • దాదాపు 1.26 లక్షల ఉద్యోగాల భర్తీ
  • వెబ్ సైట్ లో ఫలితాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామ వార్డు, సచివాలయం ఉద్యోగుల ఎంపిక పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. దాదాపు 1.26 లక్షల ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం ఈ నెల 1 నుంచి 8 వరకూ  పరీక్షలను నిర్వహించింది. ఈ సందర్భంగా 19 రకాల ఉద్యోగాల భర్తీకి 14 పరీక్షలు చేపట్టింది.

ఈ ఫలితాలను ప్రభుత్వ వెబ్ సైట్ http://gramasachivalayam.ap.gov.in/ లో చూసుకోవచ్చు. పరీక్షలు పూర్తిచేసిన 10 రోజుల్లోనే ఏపీ ప్రభుత్వం ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 30, వచ్చే నెల 1న రెండ్రోజుల పాటు శిక్షణ ఇస్తారు. అనంతరం గాంధీజయంతి(అక్టోబర్ 2) రోజున వీరంతా ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుంది. 

More Telugu News