Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో స్కూలు బస్సు బోల్తా ఘటనపై విచారణకు ఆదేశించిన మంత్రి పేర్ని నాని!

  • సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశం
  • విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా
  • నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఈరోజు ఎస్వీఆర్ స్కూలు బస్సు పంట కాల్వలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. పాఠశాల బస్సు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి నివేదికను సమర్పించాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు.

ఈ సందర్భంగా స్థానిక అధికారులకు ఫోన్ చేసిన మంత్రి నాని, ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి మరింత మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలన్నారు. స్కూలు బస్సులకు ఫిట్ నెస్ లేకపోయినా, నిబంధనలు పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Andhra Pradesh
Prakasam District
Road Accident
School bus
Perni nani
Enquiry

More Telugu News