TTD: టీటీడీ పాలకమండలి: కర్ణాటక కోటాలో పారిశ్రామికవేత్తలకే అందలం

  • సామాజిక సేవల కోటాలో సుధామూర్తికి స్థానం
  • పారిశ్రామికవేత్తల కోటాలో రమేశ్ శెట్టి, సంపత్ రవినారాయణలు
  • ఈసారి ఏపీ కోటా నుంచి డీపీ అనంత్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు పాలకమండలిలో కర్ణాటక కోటాలో పారిశ్రామిక వేత్తలకు అందలం వేశారు. సామాజిక సేవల కోటాలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ సుధామూర్తికి స్థానం దక్కగా, పారిశ్రామికవేత్తల కోటాలో కర్ణాటక కోస్తా ప్రాంతానికి చెందిన రమేశ్ శెట్టి, సంపత్ రవినారాయణలకు స్థానం లభించింది. కాగా, గతంలో కర్ణాటక కోటా నుంచి స్థానం దక్కించుకున్న పెజావర మఠానికి చెందిన డీపీ అనంత్‌కు ఈసారి ఏపీ కోటాలో చోటు దక్కింది.  

ఐదుకుపైగా కంపెనీల్లో చైర్మన్, డైరెక్టర్ హోదాల్లో సేవలు అందిస్తున్న సంపత్ రవినారాయణ గతంలోనూ టీటీడీ బోర్డు సభ్యుడిగా సేవలు అందించారు. స్టీల్ స్ట్రాంగ్ పేరిట రమేశ్ శెట్టి వంద కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన పరిశ్రమను నిర్వహిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ సిఫారసుతో ఆయనకు టీటీడీ బోర్డులో స్థానం లభించినట్టు సమాచారం.
TTD
sudhamurthy
Tirumala
Ramesh shetty
dp ananth

More Telugu News