Amit Shah: రజాకార్ల అకృత్యాలకు ఎదురొడ్డిన వీరులందరికీ వందనం: అమిత్ షా

  • నేడు తెలంగాణ విమోచన దినోత్సవం
  • తెలుగులో ట్వీట్ చేసిన అమిత్ షా
  • తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన హోం మంత్రి

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా స్పందించారు. తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు అంటూ తెలుగులో ట్వీట్ చేశారు. ఈ రోజు తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన రోజని, తెలంగాణ ప్రజలు భారత యూనియన్ లో విలీనమైన చారిత్రాత్మక దినం అని కీర్తించారు. రజాకార్ల అకృత్యాలకు ఎదురొడ్డి పోరాడిన వీరులందరికీ అభివందనం అంటూ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

More Telugu News