Chalapathi rao: తొలి సినిమా ఛాన్స్ రామారావుగారే ఇప్పించారు: సీనియర్ నటుడు చలపతిరావు

  • నాకు నాటకాల పిచ్చి ఎక్కువ 
  • నేరుగా ఎన్టీఆర్ దగ్గరికే వెళ్లాను 
  • నా తొలి సినిమా 'కథానాయకుడు'

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సీనియర్ నటుడు చలపతిరావు మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను గురించి ప్రస్తావించారు. "మొదటి నుంచి కూడా నాకు నాటకాల పిచ్చి ఎక్కువే. చదువుకునే రోజుల్లో వరుసగా నాటకాలు వేస్తూ ఉండేవాడిని. పెళ్లైన కొత్తలో .. సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన వచ్చింది. చెన్నైలో తెలిసిన వాళ్లు ఎవరూ లేకపోయినా, భార్యను వెంటబెట్టుకుని మొండి ధైర్యంతో వెళ్లిపోయాను.

అక్కడికి వెళ్లిన తరువాత తెలిసింది .. సినిమా అనేది ఒక మహా సముద్రం అని. ఎవరూ స్టూడియోలోకి కూడా రానీయడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజున ఎన్టీ రామారావుగారి దగ్గరికి వెళ్లి, ఏదైనా వేషం వుంటే ఇప్పించమని అడిగాను. ఫ్యామిలీతో వచ్చేశాను .. వెనక్కి వెళ్లలేను అని చెప్పాను. వెంటనే ఆయన 'కథానాయకుడు' దర్శకుడితో చెప్పి ఆ సినిమాలో ఒక వేషం ఇప్పించారు. అలా ఆ సినిమాతో సినీ నటుడిగా నా ప్రయాణం మొదలైంది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News