Kodela: కోడెల ఇంటి పనివాళ్లను స్టేషన్ కు తీసుకెళ్లిన పోలీసులు

  • కోడెల ఇంటికి మరోసారి వెళ్లిన పోలీసులు
  • కుటుంబ సభ్యుల నుంచి వివరాల సేకరణ
  • పనివాళ్ల నుంచి వాంగ్మూలం తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు

నవ్యాంధ్రప్రదేశ్ ప్రప్రథమ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అత్యంత విషాదకర పరిస్థితుల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన భౌతికకాయానికి కొద్దిసేపటి క్రితమే పోస్టుమార్టం ముగిసింది. అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తరలించారు. కాగా, పోస్టుమార్టం నివేదికలో కోడెల ఉరేసుకోవడం వల్లే చనిపోయారని తేలడంతో తెలంగాణ పోలీసులు ఆయన నివాసానికి మరోసారి వెళ్లారు.

కోడెల కుటుంబ సభ్యుల నుంచి బంజారాహిల్స్ ఏసీపీ మరిన్ని వివరాలు సేకరించారు. ఘటనాస్థలంలో క్లూస్, ఫింగర్ ప్రింట్స్ బృందాలు పలు ఆధారాలు సేకరించాయి. ఈ సందర్భంగా పోలీసులు కోడెల ఇంట్లో పనివాళ్లను కూడా స్టేషన్ కు తీసుకెళ్లారు. వ్యక్తిగత డ్రైవర్, గన్ మెన్ తో పాటు పనివాళ్లను కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించి వాంగ్మూలం తీసుకున్నారు. స్టేట్ మెంట్ రికార్డ్ ప్రక్రియ పూర్తయిన పిమ్మట వారిని తిరిగి ఇంటికి పంపించనున్నారు.

More Telugu News