Vijay Devarakonda: రేపు విజయ్ దేవరకొండ కొత్త సినిమా టైటిల్ ప్రకటన

  • క్రాంతిమాధవ్ దర్శకత్వంలో కొత్త సినిమా 
  • విజయ్ దేవరకొండ జోడీగా రాశి ఖన్నా 
  • సంగీత దర్శకుడిగా గోపీసుందర్

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రూపొందిన 'డియర్ కామ్రేడ్' సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది. ఆ తరువాత సినిమాను ఆయన క్రాంతిమాధవ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్స్ రాకపోవడంతో, ఈ సినిమా షూటింగు నడుస్తుందా? ఆగిపోయిందా? అనే సందేహం తలెత్తింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ ను రేపు ఉదయం 11 గంటలకు రివీల్ చేయనున్నట్టుగా దర్శక నిర్మాతలు ఒక పోస్టర్ ను వదిలారు. క్రియేటివ్ కమర్షియల్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోంది. ఇతర ముఖ్య పాత్రల్లో కేథరిన్ .. ఐశ్వర్య రాజేశ్ కనిపించనున్నారు. గోపీ సుందర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. విజయ్ దేవరకొండకి ఇది 9వ సినిమా అనే సంగతి తెలిసిందే.

More Telugu News