Chandrababu: చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై మండిపడ్డ వైసీపీ నేత ఆమంచి!

  • మా పాలనపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా
  • ఈ వ్యాఖ్యలను పవన్ వెనక్కి తీసుకోవాలి
  • టీడీపీ అనేది అక్రమ వ్యాపార సంస్థ
వైసీపీ ప్రభుత్వం వందరోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న ఘాటు విమర్శలు చేయడం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. ఈ వ్యాఖ్యలను పవన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

టీడీపీ ఒక రాజకీయపార్టీ కాదనే అభిప్రాయంతో చాలా మంది ఉన్నారని, నీతివంతమైన పాలన, సామాజిక న్యాయం జగన్ తోనే సాధ్యమని చెప్పారు. నేడు టీడీపీ ఉనికే ప్రశ్నార్థకమైందని, సిగ్గులేకుండా చంద్రబాబు తన పార్టీ వాళ్లను బీజేపీలోకి పంపుతున్నారని, టీడీపీ అనేది అక్రమ వ్యాపార సంస్థ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కులతత్వానికి వ్యతిరేకంగా ప్రజలు సీఎం జగన్ తరపున నిలబడ్డారని, గత ఎన్నికల్లో ఇదే నిరూపించారని అన్నారు. కాపులే కాదు అన్ని సామాజికవర్గాలు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
Chandrababu
Pawan Kalyan
YSRCP
Amanchi

More Telugu News