OPPO: బై బై ఒప్పో... ఇక 'బైజూస్' జెర్సీల్లో టీమిండియా!

  • ముగిసిన ఒప్పో ఒప్పందం
  • భారత క్రికెట్ జట్టు కొత్త స్పాన్సర్ గా బైజూస్
  • 2022 వరకు బైజూస్ తో కాంట్రాక్ట్
టీమిండియా క్రికెట్ పురుషుల జట్టుకు కొత్త స్పాన్సర్ వచ్చింది. ఇప్పటివరకు ఒప్పో స్మార్ట్ ఫోన్ సంస్థ ప్రధాన స్పాన్సర్ గా వ్యవహరించగా, తాజాగా ఆ ఒప్పందం ముగిసింది. ఇక నుంచి ఆన్ లైన్ లెర్నింగ్ యాప్ బైజూస్ భారత క్రికెట్ జట్టుకు స్పాన్సర్ గా వ్యవహరించనుంది. దక్షిణాఫ్రికాతో నేడు జరిగే టీ20 మ్యాచ్ నుంచి టీమిండియా ఆటగాళ్లు కొత్తగా బైజూస్ జెర్సీల్లో దర్శనమివ్వనున్నారు. కాగా, బైజూస్ తో ఒప్పందం ఈ సెప్టెంబరు 5 నుంచి 2022 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో కోచ్ రవిశాస్త్రితో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తదితర ఆటగాళ్లు కొత్త జెర్సీలు ధరించారు. ఆటగాళ్లకు సరికొత్త కిట్లు అందించారు.
OPPO
BYJUS
Team India
Jersey

More Telugu News