Kadapa District: కడప జిల్లా బద్వేలులో భారీ అగ్ని ప్రమాదం

  • కల్యాణ మండపంలో ఎగసి పడిన మంటలు
  • అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
  • భారీ ఆస్తి నష్టం
కడప జిల్లా బద్వేలులో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ మండపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలను చూసి స్థానికులు భయంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం కారణంగా భారీగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Kadapa District
badvel
Fire Accident

More Telugu News