You Tube: మారిన యూట్యూబ్ నిబంధనలు!

  • ఓ వీడియోకు ఒక్కరోజులోనే 7.5 కోట్ల వ్యూస్
  • తప్పుడు మార్గాల్లో సంఖ్యను పెంచారని ఆరోపణలు
  • లెక్కింపు విధానాన్ని మారుస్తున్నామన్న యూట్యూబ్
ఈ సంవత్సరం జూలైలో ఓ భారతీయ ర్యాప్‌ సింగర్‌ వీడియో, కేవలం ఒక్క రోజులోనే యూట్యూబ్ లో 7.5 కోట్ల వ్యూస్‌ సాధించింది. అయితే, ఈ సంఖ్యను మ్యానిపులేట్ చేశారని, తప్పుడు మార్గాల్లో పెంచారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలోనే కాదు, పలు వీడియోలను చూస్తున్న వారి సంఖ్యను కృత్రిమ పద్ధతుల ద్వారా పెంచుతున్నారని గమనించిన యూట్యూబ్, పలు కీలక మార్పులు ప్రకటించింది.

ఇకపై వీడియోల్లోని ప్రకటనలను ఎంతమంది చూశారన్న విషయంపై ఆధారపడకుండా, ఇతర పద్ధతుల ఆధారంగా ఎంత మంది చూశారన్న లెక్కను గణించనున్నామని కంపెనీ ఒక బ్లాగ్‌ పోస్ట్‌ లో పేర్కొంది. 24 గంటల్లో రికార్డు వ్యూస్‌ అన్న అంశంపైనా మార్పులు చేయనున్నామని, డైరెక్ట్‌ గా షేర్ చేసుకునే లింక్‌ లు, సెర్చ్ చేసి వీడియోలు చూస్తుండటం వంటి సహజ సిద్దమైన ప్రక్రియల ఆధారంగా ఎంతమంది చూశారన్న విషయాన్ని తేలుస్తామని పేర్కొంది.
You Tube
Views
Manipulate

More Telugu News