రాజస్థాన్‌లో దారుణం.. వివాహితకు మత్తుమందు ఇస్తూ 50 రోజులుగా అఘాయిత్యం
- ఒంటరిగా బయటకు వచ్చిన మహిళ
- కిడ్నాప్ చేసి గదిలో బంధించిన యువకులు
- బంధించడం మర్చిపోవడంతో 50 రోజుల తర్వాత తప్పించుకున్న వైనం
అందుకు ఆమె నిరాకరించడంతో ఆహారంలో డ్రగ్స్ కలిపి తినిపించారు. అది తిని ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత యువకులు తమ పశువాంఛను తీర్చుకున్నారు. 50 రోజులుగా వారు నిత్యం ఇదే పనిచేస్తుండడంతో ఆమె గర్భం దాల్చింది. ఇటీవల కిడ్నాపర్లు ఆమెను తాళ్లతో బంధించడం మర్చిపోవడంతో బాధితురాలు తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అనిల్‌కుమార్, దయానంద్, రామ్ అవతార్, రొహతాశ్‌లుగా గుర్తించారు. పరారీలో ఉన్న వారి కోసం గాలింపు మొదలుపెట్టారు.