bengaluru: బెంగళూరు పోలీసులకు శుభవార్త.. ఇకపై పుట్టిన రోజున సెలవు తీసుకునే వెసులుబాటు

  • కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశం
  • ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్
  • హర్షం వ్యక్తం చేస్తున్న పోలీసులు
బెంగళూరు పోలీసులకు ఇది శుభవార్తే. సెలవులు లేకుండా సంవత్సరాల తరబడి విధులు నిర్వర్తించే పోలీసులకు ఇకపై వారి పుట్టిన రోజునాడు సెలవులు ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను బెంగళూరు పోలీస్ కమిషనర్ భాస్కరరావు శనివారం జారీ చేశారు.

నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు ఇందుకు అర్హులని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పుట్టిన రోజున కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. పుట్టిన రోజు సెలవు ఉత్తర్వులపై పోలీసులు హార్షం వ్యక్తం చేస్తున్నారు.
bengaluru
Police
birth day
holiday

More Telugu News