golden toilet: లండన్‌లో చోరీకి గురైన రూ. 8.8 కోట్ల విలువైన అమెరికా బంగారు టాయిలెట్

  • 18 కేరెట్ల బంగారంతో తయారైన టాయిలెట్
  • రెండు రోజుల క్రితమే అమెరికా నుంచి ఇంగ్లండ్‌కు
  • ఎత్తుకెళ్లిన దొంగలు
లండన్‌లోని బ్లనియమ్ ప్రాసాదంలోని మ్యూజియంలో ఉన్న బంగారు మరుగుదొడ్డి చోరీకి గురైంది. 18 కేరెట్ల బంగారంతో చేసిన ఈ టాయిలెట్ ధర రూ.8.8 కోట్లు. న్యూయార్క్‌లోని సోలోమన్ ఆర్ గుగెన్‌హైమ్ ప్రదర్శనశాల నుంచి రెండు రోజుల క్రితమే దీనిని లండన్ తీసుకొచ్చి ప్రదర్శనశాలలో ఉంచారు. నిజానికి వచ్చే నెల 27 వరకు దీనిని ఇక్కడే ఉంచాలని మ్యూజియం నిర్వాహకులు భావించారు. అయితే, అకస్మాత్తుగా దానిని దొంగలు ఎత్తుకుపోవడంతో కలకలం రేగింది. బంగారు టాయిలెట్ చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకున్న లండన్ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
golden toilet
america
england
theft

More Telugu News