Telugudesam: చంద్రబాబు నివాసంలో గేట్ కు కట్టిన తాళ్లను తొలగించిన పోలీసులు!

  • సెక్షన్ 151 కింద నోటీసులు జారీ చేసిన పోలీసులు
  • ఆ నోటీసులో కనీస సమాచారం కూడా లేదేు
  • నోటీసు ఇవ్వకుండా నిర్బంధించడం మానవ హక్కుల ఉల్లంఘన: టీడీపీ తరఫు న్యాయవాదులు

టీడీపీ తలపెట్టిన ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనేందుకు వీలు లేకుండా హౌస్ అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో ఇంట్లోంచి బయటకు ఎవరూ రాకుండా ఆయన నివాసం గేట్ ను పోలీసులు తాళ్లతో కట్టేసిన దృశ్యాలు టీవీ చానెళ్లలో ప్రసారం అయ్యాయి. ఈరోజు రాత్రి ఆ గేట్ కు కట్టిన తాళ్లను పోలీసులు తొలగించారు.

అనంతరం సెక్షన్ 151 కింద నోటీసు జారీ చేశారు. చంద్రబాబును పన్నెండు గంటల గృహనిర్బంధం అనంతరం ఈ నోటీసు జారీ చేయడం గమనార్హం. ఆ నోటీసులో కనీస సమాచారం కూడా లేదని టీడీపీ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ విషయమై ప్రశ్నించగా పోలీసులు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారని పార్టీ వర్గాల సమాచారం. నోటీసు ఇవ్వకుండా నిర్బంధించడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని టీడీపీ తరఫు న్యాయవాదులు అంటున్నారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తున్నారు.

More Telugu News