Shah Mehmood Qureshi: జమ్మూకశ్మీర్ భారత్ కు చెందిన రాష్ట్రంగా ప్రస్తావించిన పాకిస్థాన్ మంత్రి

  • ఇప్పటివరకు 'భారత ఆక్రమిత కశ్మీర్' గా పేర్కొన్న పాక్ నేతలు
  • జెనీవాలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ సమావేశం
  • కశ్మీర్ లో అంతర్జాతీయ సంఘాలు, మీడియాను ఎందుకు అనుమతించడంలేదన్న ఖురేషి

జమ్మూకశ్మీర్ గురించి ఎప్పుడు మాట్లాడినా 'భారత ఆక్రమిత కశ్మీర్' అంటూ అక్కసు వెళ్లగక్కే పాకిస్థాన్ తొలిసారి అంతర్జాతీయ వేదికలపై జమ్మూకశ్మీర్ ను భారత్ కు చెందిన రాష్ట్రంగా పేర్కొంది. జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ సమావేశంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి ప్రసంగించారు.

"జమ్మూకశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని తక్కిన ప్రపంచాన్ని నమ్మించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. అక్కడ ఉద్రిక్తతలు చల్లబడి, సాధారణ జనజీవనం ఉంటే అంతర్జాతీయ మీడియాను ఎందుకు అనుమతించడంలేదు? అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థలను ఎందుకు అడుగుపెట్టనివ్వడంలేదు?  భారత్ లోని జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో వాస్తవ పరిస్థితిని అంచనా వేయడానికి ఎందుకు ఒప్పుకోవడంలేదు?" అంటూ ప్రశ్నించారు.

More Telugu News