Rajasekhar: రాజశేఖర్ సరసన అమలా పాల్?

  • అమలా పాల్ కి మంచి క్రేజ్
  • నటనకి ప్రాధాన్యత గల పాత్రలకే గ్రీన్ సిగ్నల్ 
  • ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి
తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా అమలా పాల్ కి మంచి క్రేజ్ వుంది. అయితే కొంత కాలంగా ఆమెకి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో తమిళంలోనే సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. అక్కడ కూడా గ్లామర్ తరహా పాత్రలు కాకుండా, నటనకి అవకాశం వున్న పాత్రలను మాత్రమే చేస్తూ వెళుతోంది.

ఈ నేపథ్యంలోనే తెలుగు నుంచి ఆమెకి ఒక అవకాశం వెళ్లినట్టుగా చెబుతున్నారు. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రాజశేఖర్ ఒక సినిమా చేయనున్నారు. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాలో కథానాయికగా అమలా పాల్ ను ఎంపిక చేసినట్టుగా సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించవలసి వుంది. మొత్తానికి అమలా పాల్ ఈ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చేస్తుందన్న మాట.
Rajasekhar
Amala Paul

More Telugu News