Kadapa District: కడప జిల్లాలో ముగిసిన యురేనియం అధ్యయన కమిటీ పర్యటన

  • రెండ్రోజుల పాటు పర్యటించిన కమిటీ
  • యురేనియం కర్మాగారం అధికారులతో చర్చలు
  • సమీప గ్రామాల ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ

కడప జిల్లా తుమ్మలపల్లి యురేనియం కర్మాగారం అంశంలో గత రెండ్రోజులుగా యురేనియం అధ్యయనం కమిటీ సాగించిన పర్యటన ముగిసింది. యురేనియం కర్మాగారం, పరిసర గ్రామాల్లో ఈ కమిటీ పర్యటించింది. యురేనియం కర్మాగారం అధికారులతో చర్చించడమే కాకుండా, ప్రజల ఇబ్బందుల విషయంలోనూ ఆరా తీసింది. దీనిపై అధ్యయన కమిటీ కన్వీనర్ బాబు మాట్లాడుతూ, యురేనియం కర్మాగారం, వ్యర్థాల చెరువును క్షుణ్ణంగా పరిశీలించామని చెప్పారు. వ్యర్థాల చెరువుపై వచ్చిన ఫిర్యాదులను కమిటీ అధ్యయనం చేస్తుందని తెలిపారు.

గ్రామాల్లో ఎక్కువగా చర్మవ్యాధులు ఉన్నట్టు గుర్తించామని, అయితే ఆ చర్మవ్యాధులు యురేనియం కాలుష్యంతో వచ్చాయా? లేక సాధారణంగానే వచ్చాయా? అనేది నిపుణులు తేలుస్తారని స్పష్టం చేశారు. రేపు మధ్యాహ్నంలోగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా, పూర్తి పారదర్శకంగా నివేదిక రూపొందిస్తామని వివరించారు.

More Telugu News