బాలీవుడ్ రీమేక్ కి చైతూ గ్రీన్ సిగ్నల్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలీవుడ్ రీమేక్ కి చైతూ గ్రీన్ సిగ్నల్?

  • చైతూ తాజా చిత్రంగా 'వెంకీమామ'
  • రీసెంట్ గా శేఖర్ కమ్ములతో సెట్స్ పైకి 
  • లైన్లో దర్శకుడు అజయ్ భూపతి 
నాగచైతన్య వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. కొంతకాలంగా 'వెంకీమామ' షూటింగులో పాల్గొంటూ వస్తోన్న ఆయన, తాజాగా మరో సినిమా కోసం శేఖర్ కమ్ములతో కలిసి పనిచేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన అజయ్ భూపతి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది.

ఇది హిందీలో భారీ విజయాన్ని సాధించిన 'బదాయి హో' సినిమాకి రీమేక్. హిందీలో క్రితం ఏడాది అక్టోబర్లో వచ్చిన 'బదాయి హో' వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. బోనీకపూర్ తో కలిసి ఆయన ఈ రీమేక్ ను నిర్మించనున్నాడని అంటున్నారు. ఈ రీమేక్ లో చేయడానికి చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.
Chaitu
Dil Raju

More Telugu News