Mahbubnagar District: మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై అత్యాచారం

  • చిన్నచింతకుంటలో ఘటన
  • ఇంటికి తీసుకెళ్తానని బైక్ ఎక్కించుకుని దారుణం
  • పరారీలో నిందితుడు
మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. నాలుగో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాధిత బాలిక అమ్మమ్మతో కలిసి ఆదివారం రాత్రి వినాయక ఊరేగింపు చూసేందుకు వెళ్లింది. ఆ తర్వాత కాసేపటికి వారి పొరుగింటి వ్యక్తి పోగుల రాజు బాలికను చూశాడు.

తాను ఇంటికి వెళ్తున్నానని, బైక్‌పై వెళ్దాం వస్తావా? అని అడిగాడు. సరేనన్న బాలిక.. అమ్మమ్మకు చెప్పి బైక్‌ ఎక్కింది. అయితే, బాలికను రాజు ఇంటికి తీసుకెళ్లకుండా గ్రామ శివారులోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన బాలిక అమ్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాలికను చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు.
Mahbubnagar District
chinnachintakunta
rape
girl

More Telugu News