Kanakadurga: కనకదుర్గమ్మకు వజ్రపు ముక్కుపుడక.. భక్తుని కానుక!

  • 106 చిన్న వజ్రాలతో ముక్కుపుడక
  • కానుకగా ఇచ్చిన పృథ్వి శివకుమార్
  • ప్రసాదాలు అందించిన అధికారులు
బెజవాడ, ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు వజ్రపు ముక్కుపుడకను ఓ భక్తుడు కానుకగా సమర్పించాడు. గుంటూరుకు చెందిన పృథ్వి శివకుమార్‌ అనే వ్యక్తి, 106 చిన్న చిన్న డైమండ్లను పొదిగిన ముక్కుపుడకను అమ్మవారికి కానుకగా ఇచ్చాడు. దీని బరువు దాదాపు 6 గ్రాములు ఉంది. దీని వెలను అతను వెల్లడించనప్పటికీ, దుర్గమ్మకు భక్తితో సమర్పించానని అన్నాడు. ఆలయ అధికారులు శివకుమార్ కు అమ్మవారి దర్శనం చేయించి, అనంతరం వేదపండితుల ఆశీర్వచనాలు అందజేశారు. అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను ప్రత్యేకంగా అందించారు.
Kanakadurga
Vijayawada
Piligrim
Daimonds

More Telugu News