Lt Gen S K Saini: దక్షిణ భారతంలో ఎప్పుడైనా ఉగ్రదాడి జరగొచ్చు.. ఆర్మీ హెచ్చరిక!

  • గుజరాత్ తీరంలో కొన్ని పడవలను గుర్తించాం
  • దాడి జరగొచ్చని నిఘా వర్గాల సమాచారం ఉంది
  • అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం

దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి భారత్ లో తీవ్ర విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమైందా? ఈసారి దక్షిణాది రాష్ట్రాల్లో ఉగ్ర పంజా విసిరేందుకు కుట్రలు పన్నిందా? అంటే  భారత ఆర్మీ ఉన్నతాధికారులు అవుననే జవాబు ఇస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎప్పుడైనా ఉగ్రదాడి జరిగే అవకాశముందని తమకు నిఘా సమాచారం అందిందని ఆర్మీ సదరన్ కమాండ్ కు చెందిన లెఫ్టినెంట్ జనరల్ ఎస్కే సైనీ తెలిపారు.

భారత్-పాక్ మధ్య గుజరాత్ వెంట ఉన్న ‘సర్ క్రీక్’ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న కొన్ని ఖాళీ పడవలను తాము గుర్తించామని వెల్లడించారు. ఎలాంటి ఉగ్రదాడి, దుశ్చర్య జరగకుండా తాము చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

More Telugu News