Telugudesam: జగన్ సర్కారు బాధ్యతాయుతంగా అందర్నీ కలుపుకుని ముందుకెళ్లాలి!: కింజరాపు రామ్మోహన్ నాయుడు

  • 100 రోజుల్లోనే అన్నీ చేయాలని కోరుకోవట్లేదు
  • కానీ జగన్ ప్రభుత్వం మాత్రం సరిగ్గా వ్యవహరించట్లేదు
  • దీర్ఘకాల అభివృద్ధికి రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలుగుదేశం నేత, లోక్ సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు సునిశిత విమర్శలు చేశారు. ఏ ప్రభుత్వమైనా వచ్చిన 100 రోజుల్లోనే అన్నీ చేసేయాలని తాము కోరుకోవడం లేదని రామ్మోహన్ నాయుడు తెలిపారు. సాధారణంగా ఈ 100 రోజుల్లో ప్రభుత్వం చేసే పనులు రాబోయే ఐదేళ్ల కాలంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు సూచికగా నిలుస్తాయని వ్యాఖ్యానించారు.

అయితే సీఎం జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మాత్రం సరిగ్గా లేదని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా, అందరినీ కలుపుకుని ముందుకెళ్లాలని సూచించారు. దీర్ఘకాల అభివృద్ధికి అనుగుణంగా సర్కారు రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయాలని కోరారు. ఈ మేరకు కింజరాపు రామ్మోహన్ నాయుడు ట్విట్టర్ లో స్పందించారు.

More Telugu News