Pakistan: మసూద్ అజర్‌ను రహస్యంగా విడుదల చేసిన పాకిస్థాన్.. అప్రమత్తమైన భారత్

  • బుద్ధి మార్చుకోని పాకిస్థాన్
  • ఉగ్రవాదులకు దిశానిర్దేశం కోసమే మసూద్ అజర్ విడుదల
  • భారత్-పాక్ సరిహద్దులో భారీ కుట్రకు పన్నాగం

ఉగ్రవాదం విషయంలో తన బుద్ధి ఏమాత్రం మారదని పాకిస్థాన్ మరోమారు ప్రపంచానికి తెలియజెప్పింది. ఇటీవల అరెస్ట్ చేసిన జైషే మహ్మద్ సంస్థ చీఫ్ మసూద్ అజర్‌ను రహస్యంగా విడిచిపెట్టినట్టు భారత ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)కి సమాచారం అందింది. భారత్-పాక్ సరిహద్దులోని రాజస్థాన్- కశ్మీర్ సెక్టార్లో పెద్ద కుట్రకు పాక్ పావులు కదుపుతోందన్న ఐబీ సమాచారంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును జీర్ణించుకోలేకపోతున్న పాకిస్థాన్.. భారత్‌ను అస్థిరపరిచేందుకు కుట్రలు చేస్తోంది. ఈ క్రమంలో రాజస్థాన్ సరిహద్దులో భారీ స్థాయిలో ఆర్మీని మోహరించింది. భారత్‌కు దీటైన సమాధానం ఇస్తామని ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్ హెచ్చరించారు. అందులో భాగంగానే ఇప్పుడు మసూద్‌ను వదిలిపెట్టినట్టు ఐబీ భావిస్తోంది.

More Telugu News