Kcr: కేసీఆర్ కేబినెట్ లో అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతం: మంత్రి పువ్వాడ అజయ్

  • కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయను
  • మొదటి నుంచి తనను కేటీఆర్ ప్రోత్సహించారు
  • టీఆర్ఎస్ లో అసంతృప్తి వార్తలు అవాస్తవం
కేసీఆర్ కేబినెట్ లో అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతం అని కొత్త మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయనని అన్నారు. మొదటి నుంచి తనను కేటీఆర్ ప్రోత్సహించారని చెప్పారు. ఖమ్మం జిల్లా అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని, తుమ్మల నాగేశ్వరరావులా జిల్లా అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. టీఆర్ఎస్ లో అసంతృప్తి వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. కాగా, ఖమ్మంకు చెందిన  పువ్వాడ అజయ్ రాజకీయ ప్రస్థానం వైసీపీలో ప్రారంభమైంది. ఆ తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతర పరిణామాల నేపథ్యంలో 2018లో టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 
Kcr
TRS
Minister
Puvvada vijay
khammam

More Telugu News