Telugudesam: ప్రత్యేక విమానాల్లో తిరిగిన చంద్రబాబు సాధించిందేమీ లేదు: దాడి వీరభద్రరావు

  • టీడీపీని ఓడించిన ప్రజలదే తప్పని విశ్వసించే నియంత బాబు
  • రాజధాని భూములను బాబు తన అనుచరులకు ఇచ్చారు  
  • చంద్రబాబు ఓ సూపర్ ప్రధానిగా భావించుకున్నారు
మొన్నటి ఎన్నికల్లో తమ పార్టీని ఓడించిన ప్రజలదే తప్పని విశ్వసించే నియంత చంద్రబాబునాయుడు అని వైసీపీ నేత దాడి వీరభద్రరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ముప్పై మూడు వేల ఎకరాలను రైతుల నుంచి సేకరించి, వాటిని తన అనుచరులకు ధారాదత్తం చేయడం చంద్రబాబుకు న్యాయమా? అని ప్రశ్నించారు. హైకోర్టును ఐదేళ్ల పాటు ఏపీకి రాకుండా చేసిన చంద్రబాబుకు ఏ శిక్ష విధించాలి? అంటూ ధ్వజమెత్తారు.

నాడు చంద్రబాబు తనను సీఎంగా కాకుండా సూపర్ ప్రధానిగా భావించుకుని, ప్రత్యేక విమానాల్లో తిరిగి సాధించిందేమీ లేదని అన్నారు. మోదీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించిన చంద్రబాబు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. మూడు నెలల్లో సీఎం జగన్ మేనిఫెస్టోలోని అంశాలను 99 శాతం అమలు పరిచి రికార్డు సృష్టించారని ప్రశంసించారు.
Telugudesam
Chandrababu
Deadi Veerabhadra rao
YSRCP

More Telugu News