Andhra Pradesh: గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే వంద రోజుల పాలన ఎలా చేశారు?: బొత్సకు టీడీపీ నేత అనగాని సూటి ప్రశ్న

  • రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ గెజిట్ విడుదల చేశాం
  • జీవో నంబర్ 254లోనూ గెజిట్ గురించి ప్రస్తావించాం
  • రాజధాని అంశంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు

ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ నాడు టీడీపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందా? అని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్ స్పందించారు. గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే వంద రోజుల పాలన ఎలా చేశారని ప్రశ్నించారు.

2014 డిసెంబర్ 30న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశామని, జీవో నంబర్ 254లోనూ గెజిట్ గురించి ప్రస్తావించడం జరిగిందని గుర్తుచేశారు. మంత్రిగా ఉన్న బొత్స అవాస్తవాలు ఎలా మాట్లాడతారు? అని ప్రశ్నించారు. సీఎం మాట్లాడాల్సిన రాజధాని అంశంపై బొత్స ఎందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజధాని అంశంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని, దీనిపై జగన్ ఇంత వరకూ వివరణ ఇవ్వకపోవడం బాధాకరమని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రాజధాని అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ధ్వజమెత్తారు.

More Telugu News