Telangana: తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు.. హరీశ్ రావుకు ఆర్థిక శాఖ

  • కొత్త మంత్రులు ఆరుగురు ప్రమాణస్వీకారం
  • కేటీఆర్ కు ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖలు
  • సబితా ఇంద్రారెడ్డికి విద్యా శాఖ
తెలంగాణ కేబినెట్ ను ఈరోజు విస్తరించిన విషయం తెలిసిందే. ఆరుగురు కొత్త మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కొంచెం సేపటి క్రితం ప్రమాణస్వీకారం చేశారు. కొత్త మంత్రులకు శాఖలు కేటాయించినట్టు తెలుస్తోంది. హరీశ్ రావుకు ఆర్థిక శాఖ, కేటీఆర్ కు ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ, సబితా ఇంద్రారెడ్డికి విద్యా శాఖ, సత్యవతి రాథోడ్ కు గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు, పువ్వాడ అజయ్ కు రవాణా శాఖ, గంగుల కమలాకర్ కు బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ కేటాయించినట్టు సమాచారం. కాగా, తెలంగాణ కేబినెట్ విస్తరణతో మంత్రుల సంఖ్య 18కి చేరింది.
   
Telangana
Ministers
Harish Rao
KTR
Sabitha

More Telugu News