TRS: టీ-ప్రభుత్వానికి ముందుచూపు లేకనే యూరియా కొరత: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • యూరియా కొరతపై పొంతన లేని మాటలు తగదు
  • రాష్ట్రానికి సరిపడా యూరియాను కేంద్రం పంపింది
  • పార్టీ మారిన ఎమ్మెల్యేలను కేబినెట్ లోకి తీసుకోవడం సరికాదు
తెలంగాణలో యూరియా కొరతపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. యూరియా కొరతపై మంత్రుల ప్రకటనలకు వ్యవసాయ శాఖ అధికారుల మాటలకు పొంతన లేదని విమర్శించారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లనే యూరియా కొరత ఏర్పడిందని, రాష్ట్రానికి సరిపడా యూరియాను కేంద్రం పంపిందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి ప్రస్తావించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను మంత్రి వర్గంలోకి తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. మోదీ వంద రోజుల పాలనపై కిషన్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ముందుచూపు, సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ మోదీ నిర్ణయాలు ఉన్నాయని అన్నారు. మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకున్నారని, ప్రజాస్వామ్య బద్ధంగా నిర్ణయాలు తీసుకునేది బీజేపీ మాత్రమేనని అన్నారు.
TRS
congress
Minister
Kishan reddy
kcr

More Telugu News