ప్రెసిడెంట్ ట్రంప్.. మాకు స్వాతంత్ర్యం కల్పించండి.. హాంకాంగ్ లో సరికొత్త ఆందోళన!
- హాంకాంగ్ లో చైనా వ్యతిరేక ఉద్యమం ఉద్ధృతం
- ప్రజాస్వామ్య హక్కులు కాపాడాలని నిరసన
- అమెరికా, బ్రిటన్ లపై చైనా ఆగ్రహం
ఇందుకు అంగీకరించిన చైనా ప్రస్తుతం ‘ఒకదేశం రెండు వ్యవస్థలు’ అనే విధానాన్ని పాటిస్తోంది. అయితే ఇటీవల హాంకాంగ్ పాలకులు ఈ ప్రాంతంలో నేరాలకు పాల్పడే వ్యక్తులను చైనాకు అప్పగించేలా, అక్కడి కోర్టులు విచారించేలా కొత్త బిల్లును రూపొందించారు. దీంతో తమ ప్రజాస్వామ్య హక్కులను, స్వేచ్ఛను చైనా హరించి వేస్తోందని హాంకాంగ్ వాసులు ఉద్యమబాట పట్టారు.
చివరికి ఈ బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని హాంకాంగ్ సీఈవో క్యారీ లామ్ ప్రకటించినప్పటికీ పరిస్థితి సద్దుమణగకపోగా, ఆందోళన కాస్తా ప్రజాస్వామ్య ఉద్యమం రూపు తీసుకుంది. కాగా, ఈ ఉద్యమం వెనుక అమెరికా, బ్రిటన్ లు ఉన్నాయని చైనా ఆరోపిస్తోంది. ఈ ఆందోళనల వల్ల హాంకాంగ్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని చైనా హెచ్చరించింది. అయితే డ్రాగన్ దేశం వాదనల్ని అమెరికా, బ్రిటన్ లు ఖండించాయి. ఆందోళనకారుల విషయంలో చైనా సంయమనం పాటించాలనీ, మానవహక్కులను ఉల్లంఘించరాదని కోరాయి.