గ్రామ సచివాలయం అభ్యర్థులకు శుభవార్త.. 4 మార్కులు అదనంగా కలపనున్న అధికారులు!
- ప్రవేశపరీక్షలో నాలుగు తప్పుడు ప్రశ్నలు
- గ్రామ సచివాలయం, డిజిటల్ అసిస్టెంట్ అభ్యర్థులకు చెరో రెండు మార్కులు
- నిర్ణయం తీసుకున్న ఏపీ అధికారులు
4,465 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు మొత్తం 11,62,164 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ‘కీ’ని అధికారులు నిన్న విడుదల చేశారు. మరోవైపు ఈ నెల 1న జరిగిన డిజిటల్ అసిస్టెంట్ పరీక్షలో కూడా 2 ప్రశ్నల్లో తప్పులు దొర్లినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులందరికీ 2 మార్కులు కలపాలని నిర్ణయించారు. ఈ ప్రశ్నలకు గానూ అభ్యర్థులు ఏ జవాబును పెట్టినా పూర్తి మార్కులు ఇస్తామని పేర్కొన్నారు.